కోదాడ,మార్చి 04(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:మోతె మండల పరిషత్ కార్యాలయంలో కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు,సమస్యలపై అధికారులు,ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ప్రజలు,ప్రజా ప్రతినిధుల నుండి విజ్ఞప్తులను స్వీకరించి అక్కడే ఉన్న సంబంధిత అధికారులతో మాట్లాడి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా అర్&బి పరిధిలోని సింగిల్ లైన్ రోడ్లను డబుల్ లైన్ రోడ్లు గాను,రోడ్డు మరమ్మతులకు గాను10 రోడ్లను 76.50 కోట్లతో ప్రతి పాదనలు చేయడం జరిగిందని,అదేవిదంగా 7 చోట్ల హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి 36 కోట్లతోను ప్రతి పాదనలు సిద్ధం చేశానన్నారు.పంచాయతీ రాజ్ పరిధిలోని 48 బిటి రోడ్ల పునర్నిర్మాణానికి 72.77 కోట్లతోను,110 కొత్త బిటి రోడ్ల నిర్మాణానికి 237 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు.అనంతరం మోతె లో స్వస్తిక్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ను ప్రారంభించారు.ఇటీవల ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడిన మోతె కు చెందిన దోసపాటి నాగయ్యని పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మోతె మండల అధికారులు,ప్రజా ప్రతినిధులు,నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



