యంపీజే -ఏపి రాష్ట్ర శాఖ సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు వైద్య, ఆరోగ్య హక్కు పక్షోత్సవం
Mbmtelugunews//ప్రకాశం జిల్లా, సెప్టెంబర్,04:యంపీజే -ఏపి రాష్ట్ర శాఖ సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు వైద్య, ఆరోగ్య హక్కు పక్షోత్సవంలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణ యంపీజే శాఖ ఆద్వర్యంలో నిన్న,నేడు పట్టణంలోని మూడు అర్బన్ హెల్త్ సెంటర్లను,జిల్లా హాస్పిటల్ లను యంపీజే సందర్శించింది.అక్కడ జరుగుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో రోగులతో మాట్లాడి తెలుసు కోవడం జరిగింది.అర్బన్ హెల్త్ సెంటర్లలో రోజుకి యావరేజ్ గా 60 ఓపిలు,ల్యాబ్,ఒక డ్యూటీ డాక్టర్,నలుగురు స్టాఫ్ తో నడుస్తుండగా,జిల్లా హాస్పిటల్ లో రోజుకి 550 మంది ఓపికతో,14 రకాల డిపార్ట్మెంట్ లకు సంబంధించి 79 జనరల్ డాక్టర్లు,ఇంకా ఎపివివిఎ-20,సియంఓ-5 డాక్టర్లు సేవలను అందిస్తున్నారు.64 స్టాఫ్ నర్సులు,17 మంది సెక్యూరిటీ,34 శానిటేషన్ సిబ్బందితో నడుస్తున్నాయి.ఈ హాస్పిటల్ లలో ఇస్తున్న సదుపాయాలతో రోగులు సంతృప్తి వ్యక్తం చేశారని,జిల్లా హాస్పిటల్ సూపరింటెండెంట్ పి సావిత్రి,డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాస రావులు హాస్పిటల్ మేయింటేనెన్స్ పరంగా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారని రోగుల ద్వారా యంపీజే బృందం తెలసుకుంది.అయితే డయాలసిస్ సెంటర్ ఉన్న కిడ్నీ డాక్టర్ లేకపోవడం,గుండె జబ్బుల డాక్టర్ లేక పోవడంతో రోగులు దూర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తుంది.ఈ సందర్భంగా యంపీజే రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ వెనుకబడిన పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో మెడికల్ కాలేజీ అవశ్యకత ఉందని,గత ప్రభుత్వం ఒంగోలు రోడ్ లో మెడికల్ కాలేజీ ప్రారంభించి సగం పూర్తి చేసిందని,ప్రస్తుత కూటమి ప్రభుత్వం కాలేజికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు తీసుకుని వచ్చి పూర్తి చేయించాలని,అందుకోసం ఈ ప్రాంతం ఎమ్మెల్యేలు కృషి చేయాలని కోరారు.ఒక వేళ కాలేజీ రద్దు పరిస్తే చాలా మంది డాక్టర్లు వెళ్లి పోవలసి వస్తుందని,కాబట్టి ఈ ప్రాంతానికి చెందిన ప్రజలు వైద్య సేవలు పొందటం కష్టతరమని,అవసరమైతే మెడికల్ కాలేజీ కోసం కలిసివచ్చే పార్టీలు,సంఘాలతో ఉద్యమిస్తామని చెప్పారు.
ఈకార్యక్రమంలో యంపీజే మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ అబ్దుల్ రసూల్,పట్టణ అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరావలి,ప్రధాన కార్యదర్శి పి హబీబుల్లా ఖాన్,ఉపాధ్యక్షులు సయ్యద్ మస్తాన్ వలి,ఖాజా,కోశాధికారి జవాద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.



