యదేచ్చగా చెరువు కబ్జా
:పట్టించుకోని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు.
అనంతగిరి,జూన్ 08(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రాణకోటికి జీవనాధరం నీరు ఆ నీరును నిలువచేసే చెరువులు గ్రామాలలో కొంతమంది జాకు ప్రయత్నిస్తున్నారు.గ్రామాలలో తాగునీటి అవసరాలకు వ్యవసాయ పనులకు చెరువులను తవ్వించి నీటిని నిల్వ చేసి అవసరాలకు అనుగుణంగా ప్రజలు వినియోగించుకుంటారు.అలాంటి చెరువులను కొంతమంది కబ్జాదారులు కబ్జా చేస్తున్నారు.ఈ తతంగం అంతా అనంతగిరి మండల కేంద్రంలో జరుగుతుంది వివరాల్లోకి వెళితే అనంతగిరి మండల కేంద్రంలోని నరసన్న కుంట గత కొన్ని సంవత్సరాలుగా అనంతగిరి గ్రామ ప్రజలకు, జంతువులకు తాగు వ్యవసాయ పనులకు ఉపయోగపడుతుంది. అలాంటి చెరువు ను గ్రామానికి చెందిన కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి చెరువులో యదేచ్చగా ఫెన్సింగ్ వేస్తూ కబ్జా చేస్తున్నారు.ఈ వ్యవహారం అంతా మండల తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో జరుగుతున్న సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది ఇరిగేషన్ అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.



