యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెనింగ్
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 10( ప్రతినిధి మాతంగి సురేష్): బహుజన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎస్ఎఫ్ఐ) చేపట్టిన యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెనింగ్ 60 రోజుల కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ బిఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యకులు కర్ల ప్రేమానంద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ సలీం షరీఫ్ పాల్గొని సే నో టూ డ్రగ్స్ పోస్టర్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సలీం షరీఫ్ మాట్లాడుతూ – మాదకద్రవ్యాల వాడకం నేటి యువతలో వేగంగా పెరుగుతోందని, అది వ్యక్తిగత జీవితం మాత్రమే కాకుండా కుటుంబం, సమాజం మొత్తానికి ముప్పుగా మారుతోందని తెలిపారు. డ్రగ్స్, సిగరెట్, మద్యం వంటి వ్యసనాలకు దూరంగా ఉంటేనే మన ఆరోగ్యం, భవిష్యత్తు కాపాడబడుతుందని సూచించారు.యువతలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ఎడ్యుకేట్ అగిటెట్ ఆర్గనైజ్ అనే బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇచ్చిన స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని బీఎస్ఎఫ్ఐ ప్రారంభించింది. నో స్మోకింగ్ నో ఆల్కహాల్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెనింగ్ 60 రోజులు కొనసాగుతోంది.ఈ సందర్భంగా బిఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపధ్యక్షులు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల ప్రభావం నుంచి సమాజాన్ని దూరంగా ఉంచడం ప్రతి యువకుడి బాధ్యత అని, విద్యార్థులు తమ స్నేహితులను కూడా ఈ ఉద్యమంలో భాగం చేయాలని పిలుపునిచ్చారు.సమాజం డ్రగ్, మద్యపానం & ధూమపానం కి నో చెప్పి ఆరోగ్యవంతమైన, చైతన్యమయమైన భారత నిర్మాణానికి తోడ్పడాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఇంచార్జి నల్ల అఖిల్ పటేల్, కోదాడ నియోజకవర్గ ఉపాధ్యకులు హేమంత్, అంచ శివ చౌదరి,తదితరులు పాల్గొన్నారు.



