యాచకుడు మూగయ్య మృతి
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 05:గత 40 సంవత్సరాల క్రితం ఒక మూగ చెవిటి మాటలు రాని మగ వ్యక్తి రామాపురం క్రాస్ రోడ్ వద్దకు వచ్చి హోటల్ లో పనిచేస్తూ ఉండేవాడు.అతని పేరు మరియు ఊరు ఎవరికి తెలియదు రామాపురం క్రాస్ రోడ్డు వద్ద దుకాణదారులు అందరూ అతన్ని మూగయ్య అనే పేరుతో పిలుస్తుండేవారు.ఇప్పుడు అతని వయస్సు సుమారు 60 సం లు.అతని వయస్సు మీద పడటం వల్ల రామపురం క్రాస్ రోడ్ వద్ద దుకాణా దారుల వద్ద అడుక్కోని తింటూ జీవిస్తున్నాడు.అతను అనారోగ్యంతో తేదీ 04.10.2024 రోజు మద్యాహ్నం 02:00 గంటల సమయంలో చనిపోయినాడు.అతనికి కుటుంబ సభ్యులు బంధువులు ఎవరూ లేకపోవడం వల్ల రామాపురం క్రాస్ రోడ్డు వద్ద బైక్ మెకానిక్ షాప్ అతను అయిన షేక్ సుభాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయనైనది.అతని శవం (డెడ్ బాడీ) కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి లో ఉన్నది. ఇతనిని వారి బంధువులు ఎవరన్నా గుర్తించినచో ఈ కింది నెంబర్లకు ఫోన్ చేయగలరు. సెల్ నెంబర్. 8712686043 ఎస్ఐ కోదాడ రూరల్