యాదవుల సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమే సదర్ సమ్మేళనం:చిన్న శ్రీశైలం యాదవ్
:అంజి యాదవ్ ఇంటి నుండి సదరు ఉత్సవాలను ప్రారంభించిన శ్రీశైలం యాదవ్
Mbmtelugunews//కోదాడ,నవంబర్ 04(ప్రతినిధి మాతంగి సురేష్):యాదవుల సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమే సదర్ సమ్మేళనమని శ్రీశైలం యాదవ్ అన్నారు.కోదాడ,హుజూర్ నగర్ నియోజకవర్గాల యాదవ సంఘాల ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా సదర్ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం రాత్రి నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలోని తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు,బిజెపి రాష్ట్ర నాయకులు మల్లెబోయిన అంజి యాదవ్ నివాస గృహములో దున్నపోతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టణ పురవీధులలో పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.దున్నపోతుల విన్యాసాలను ప్రదర్శించారు.ఈ ప్రదర్శనలు ప్రజలను ఎంతో ఆకర్షించాయి అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో యాదవ సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు నియోజకవర్గాల సంబంధించిన యాదవ కుల సంఘ పెద్దలు మాట్లాడారు కోదాడ చరిత్రలో తొలిసారిగా యాదవ సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయటానికి సమ్మేళనాన్ని నిర్వహించిన నిర్వహణ కమిటీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సదర్ సమ్మేళనం యాదవుల ఆర్థిక రాజకీయ సామాజిక చైతన్యం రావడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

గత చరిత్రలో తీసుకుంటే యాదవులు పాడి పశువులను సమృద్ధి చేసి ఆ పాడి తోటి జీవనోపాధి కొనసాగించే వాళ్ళని ఆనాటి నుండి నేటి వరకు పాడి పశువులను పూజించే సాంప్రదాయం యాదవులకు వస్తుందని దానినే సదర్ సమ్మేళనంగా నిర్వహించే వాళ్ళని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ సమ్మేళనాన్ని కొత్తగా నిర్వహిస్తుందని దానికి యాదవులంతా ఎంతో సంతోషం వ్యక్తం చేయాలని అన్నారు.ఈ సమ్మేళనంలో పలురకాల పశువులను పూజించి వాటిని ఈ సమ్మేళనంలో ప్రదర్శించారని ఈ ప్రదర్శన పలువురిని ఆకర్షించిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ఎన్ ఎం శ్రీకాంత్ యాదవ్,అధ్యక్షులు బొల్లం సిద్దు,జక్కుల నరేందర్,బత్తుల కిట్టు,మర్ల వీరబాబు,బొమ్మ సాయి కృష్ణ,వీరబోయిన లింగయ్య,కోడి ఉపేందర్,జడ అంజి యాదవ్,గొట్టి నాగరాజు,పెద్దలు ఈదుల కృష్ణయ్య,కట్టేబోయిన శ్రీను,గుండెల సూర్యనారాయణ,జక్కుల మల్లయ్య,మాదాల ఉపేందర్,యాదవ ప్రజాప్రతినిధులు,యాదవ కులస్తులు పాల్గొన్నారు.