యుద్దోన్మాది అమెరికా అండతో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు ఆపాలి !
Mbmtelugunews//కోదాడ,అక్టోబర్ 07(ప్రతినిధి మాతంగి సురేష్):స్థానిక రంగా థియేటర్ చౌరస్తాలో సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ ఆధ్వర్యంలో,పాలస్తీనా పై అమెరికా అండతో ఇజ్రాయిల్ జరుపుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా అరుణోదయ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి పాల్గొని మాట్లాడుతూ అమెరికా దాని మిత్ర దేశాల అండతో ఇజ్రాయిల్ గత సంవత్సర కాలంగా పాలస్తీనా పై అక్కడి ప్రజలపై చేస్తున్న యుద్ధం దుర్మార్గమైనదని తక్షణమే ఈ యుద్ధాన్ని ఆపాలన్నారు.యుద్ద పిపాసి అమెరికా గతంలో వియత్నాం,ఆప్ఘనిస్థాన్,ఇరాక్ లాంటి పేద దేశాల పైన
మారణహోమం సాగించి చివరకు భంగపాటుకు గురైనదని అన్నారు.సంవత్సర కాలంగా పాలస్తీనాలో ఇజ్రాయిల్ నరమేధం సృష్టిస్తున్న నోరు మెదపని అమెరికా నేడు ఇజ్రాయిల్ కు మద్దతుగా ఇరాన్ పై గొంతు చించుకుంటుందని అన్నారు.అనేక దేశాల మధ్య తగువులు పెట్టి తమ ఆయుధాలను అమ్ముకునే ద్వందనీతి కలిగినటువంటి అమెరికా సామ్రాజ్యవాద విధానాలను ప్రజలంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ప్రపంచ దేశాల పీడిత వర్గం పాలస్తీనాకు మద్దతు తెలియజేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రైతు కూలి సంఘం నాయకులు అలుగుబెల్లి సత్యనారాయణ రెడ్డి,మద్దెల ప్రతాప్,కామల్ల రవి,మద్దెల వెంకన్న,చరణ్,ప్రభాకర్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు