Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 26:స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చి ఆవరణలో కోదాడ వారి ఆధ్వర్యంలో భారతరత్న త్యాగాల పెన్నిధి కరుణామూర్తి సెయింట్ భారతరత్న మదర్ థెరిస్సా 114వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి నివాళులు అర్పించారు.అసోసియేషన్ అధ్యక్షులు రెవ డాక్టర్ వి ఏసయ్య మాట్లాడుతూ మదర్ థెరిస్సా సేవలు శిరస్మరణీయమని ఇండియా దేశం కలకత్తా రాష్ట్రంలో కుష్లోగులకు పేదలకు అనారోగ్యం ఉన్నవారికి ఎంతో సేవ చేశారని వారి సేవను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రదానం చేసిందని ఈమె ప్రపంచానికే గొప్ప ఆదర్శమూర్తి అని అన్నారు.45 సంవత్సరాల పాటు మిషనరీస్ ఆఫ్ శారిటి ని భారతదేశంలో ఇతర దేశాల్లో వ్యాపింపచేసేన ఘనురాలని కొనియాడారు.అనంతరం కోదాడ మున్సిపాలిటీ క్రిస్టియన్ కో ఆప్షన్ సభ్యులు వంటేపాక జానకి ఏసయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మదర్ తెరిసా ను ఆదర్శం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసగౌడ్,జి ఆర్ అబ్రహం,ఎం సుందర్రావు,ఆనంద్ నాయక్,రాజేష్,ప్రభుదాస్,యవనస్తులు రాహుల్,రాంబాబు,మోజస్ తదితరులు పాల్గొన్నారు.
యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ కోదాడ ఆధ్వర్యంలో ఘనంగా మదర్ థెరిస్సా 114 జయంతి వేడుకలు
RELATED ARTICLES