యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ కోదాడ వారి ఆధ్వర్యంలో క్రిస్తవుల ప్రత్యేక ప్రార్థనలు
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 03:స్థానిక నయానగర్ బాప్టిస్ట్ చర్చి ఆవరణంలో కోదాడ,సూర్యపేట,ఖమ్మం,విజయవాడ వరద బాధితుల కొరక యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
పూర్తిగా ఖమ్మం,వరంగల్,కోదాడ ప్రాంతాలు వరద ఉధృతికి కొందరు ప్రాణాలు కోల్పోయారు కొందరికి సరైన ఆహార పొట్నాలు దొరకక ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు.దేవుడే సహాయం చేసి వారికి మనోధైర్యాన్ని ప్రసాదించా లని ప్రార్ధించారు.ఇంకా పోలీస్ సిబ్బంది,మున్సిపల్ సిబ్బంది,వైద్య సిబ్బంది కొరకు,నిలిచిపోయిన వాహనదారుల కొరకు,దాతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఇట్టి కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ క్రిస్టియన్ కోఆప్షన్ సభ్యురాలు వంటే పాక జానకి యేసయ్య,యునైటెడ్ పాస్టర్ అసోసియేషన్ నియోజకవర్గ అధ్యక్షులు పాస్టర్ ఏసయ్య,ఉపాధ్యక్షులు డేవిడ్ రాజారావు,కో-ఆర్డినేటర్ ఎం సుందర్రావు,పట్టణ అధ్యక్షులు ప్రభుదాస్,కోదాడ నియోజకవర్గం సెక్రటరీ రాజేష్,అనంతగిరి మండల అధ్యక్షులు డేనియల్,హారిగోన్స్,సామ్యూల్,శిబా,శాలిని,మోజస్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.