యువత క్రీడలపై ఆసక్తి చూపాలి: జల్లా జనార్ధన్
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 25(ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండల పరిధిలోని దొండపాడు గ్రామంలో డిపిఎల్ 10 వ సీజన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగినది.ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చింతలపాలెం ఎస్సై సుధీర్ కుమార్ రెడ్డి, సూర్యాపేట జిల్లా సేవా పక్షం కో కన్వీనర్ జల్లా జనార్దన్ రావు, చింతలపాలెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరాల కొండారెడ్డి, బిఆర్ఎస్ పార్టీ చింతలపాలెం మండల అధ్యక్షుడు మధిర సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీపీ కొత్తమద్ది వెంకటరెడ్డి, దొండపాడు మాజీ ఉపసర్పంచ్ మధిర వెంకటరెడ్డి, బిజెపి పార్టీ చింతలపాలెం మండల అధ్యక్షుడు ప్రతిపాటి విజయ్, కృష్ణ భగవాన్ యూత్ దొండపాడు మాజీ వార్డ్ నెంబర్ దొంగల వీరబాబు, దొండపాడు మాజీ ఎంపీటీసీ తోట శేషు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, క్రికెట్ క్రీడాకారులు యువ నాయకుడు రేల జగన్మోహన్ రెడ్డి తదితర పెద్దలు పాల్గొన్నారు.అనంతరం అయన మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి, జీవితం నాశనం చేసుకోవద్దు, భావిభారతులు, భారతదేశానికి యువత ప్రాధాన్యత కలిగి ఉండాలి, సమాజంలో సేవా దృక్పథంతో కలిగి ఉండాలి,
తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చినప్పుడే మన జీవితం సార్థకత అయిద్ది అని యువత క్రీడా కార్యక్రమము పాల్గొని ఆరోగ్యంగా ఉండాలి ఐక్యత భావం చాటాలి
ప్రతి ఒక్కరూ సమాజ సేవ చేయాలని అన్నారు.



