యువత వ్యాపారంలో ముందుకు సాగాలి.
:యువత ఆర్థికంగా ఎదగాలి.
Mbmtelugunews//కోదాడ,డిసెంబర్ 08(ప్రతినిధి మాతంగి సురేష్):యువత వ్యాపారంలో ముందుకు సాగాలి అని ప్రముఖ సీనియర్ వైద్యులు జాస్తి సుబ్బారావు,జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ లు అన్నారు.ఆదివారం పట్టణంలోని హుజూర్ నగర్ రోడ్డు లో ప్రోప్రైటర్ చలిగంటి రంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎస్ ఆర్ కార్ వాషింగ్ హోమ్ కన్సల్టెన్సీ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించి వారు మాట్లాడారు.యువత వ్యాపారంలో కూడా తమ సత్తాను చాటాలి అని అన్నారు.
కష్టపడితే సాధించలేనిది ఏమీలేదని తెలిపారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు,శ్రీరామ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.