యువత స్వయంకృషితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలి
నూతనంగా శ్రీ విజయ కృష్ణ దీపావళి బాణాసంచా దుకాణం ప్రారంభోత్సవం.
:సీనియర్ వైద్యులు డా, సుబ్బారావు, చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి
Mbmtelugunews//కోదాడ,సెప్టెంబర్ 29 (ప్రతినిధి మాతంగి సురేష్): యువత స్వయంకృషితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సీనియర్ వైద్యులు డా, సుబ్బారావు, టిపిసిసి డెలిగేట్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డిలు అన్నారు. పట్టణ పరిధిలోని హుజూర్నగర్ ఫ్లైఓవర్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీ విజయ కృష్ణ దీపావళి బాణాసంచా షాపు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సోమవారం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డాక్టర్ జాస్తి సుబ్బారావు, టీపీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావులు పాల్గొని ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ యువత స్వయంకృషితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. కోదాడ పట్టణం దినదినం అభివృద్ధిలో ముందుకు సాగుతుందని యువత స్వయంకృషితో వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ కొండల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, వీరారెడ్డి, నజీర్, శివ, ఇఫ్రాన్, ఉపేందర్, నజీర్ తదితరులు షాప్ యజమాన్యం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.



