యువత స్వయం శక్తితో ఎదిగి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి:సర్పంచ్ మందుల నాగయ్య
Mbmtelugunews//కోదాడ, జనవరి 15:(ప్రతినిధి మాతంగి సురేష్): యువత స్వయం శక్తితో ఎదిగి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సర్పంచ్ మందుల నాగయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి లు అన్నారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో గురువారం రాత్రి కాలితిరిపి శ్రీను కుమారుడు పవన్ Tata Intra V 50 బండి ఓపెనింగ్ చేసిన గుడిబండ గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య, కోదాడ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, గుడిబండ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇర్ల నరసింహారెడ్డిలు ప్రారంభించి మాట్లాడుతూ యువత తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా స్వయం శక్తితో ఎదిగి వేరే వారికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుక్కడపు సైదులు, ఐదోవ వార్డ్ మెంబర్ వంశీ, తొమ్మిదో వార్డ్ మెంబర్ ప్రేమ్ చందు, పదో వార్డు మెంబర్ రోజ రవి, గుడిబండ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



