యూనియన్ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
:ఘనంగా యాతాకుల మధుబాబు జన్మదిన వేడుకలు
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 18(ప్రతినిధి మాతంగి సురేష్): యూనియన్ నాయకుడు మధు బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.వైద్య ఆరోగ్యశాఖ సూర్యాపేట జిల్లా యూనియన్ అధ్యక్షులు యాతాకుల మధుబాబు జన్మదిన వేడుకలు కోదాడ శాసనసభ్యులు నలమాద ఉత్తమ్ పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాతాకుల మధుబాబు అంచలంచలుగా ఎదుగుతూ సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ యూనియన్ నాయకత్వ బాధ్యతలతో అనేకమంది సహజర ఉద్యోగుల, ఆశా కార్యకర్తల సమస్యల సాధన విషయంలో చేస్తున్న పోరాటం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సూర్యపేట డిఎంహెచ్ఓ డాక్టర్ పెండెం వెంకటరమణ, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ వేణు గోపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి ,మాజీ ఎంపీపీ చుండూరు వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, వెంపటి వెంకటేశ్వరరావు, మండల ప్రజాప్రతితులు , నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.



