రంజాన్ తోపాను అందజేసిన సర్పంచ్ పాలకి సురేష్
Mbmtelugunews//కోదాడ, మార్చి 20(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని దోరకుంట గ్రామంలో మసీదు నందు రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలకు అందిస్తున్న రంజాన్ తొఫాను ముస్లిం కుటుంబాలకు సర్పంచ్ పాలకి సురేష్ శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ముస్లిం సోదరీ సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ కుటుంబాలకు అండగా ఉంటుందని అన్నారు. రంజాన్ పర్వదినాన్ని ముస్లింలంతా ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రశాంతమైన వాతావరణం లో జరుపుకోవాలని అన్నారు. ఇట్టి కార్యక్రమంలో వార్డు మెంబెర్స్ అమీనా, ఖయ్యూం, పాలడుగు జాన్, కాంగ్రెస్ నాయకులు పత్తిపాక వెంకటేశ్వర్లు, జక్కుల నరసింహారావు, పత్తిపాక రాంబాబు, ఒగ్గు నాగేంద్రబాబు, సుంకర మల్లేశ్వరరావు, షేక్ అహ్మద్, డ్రైవర్ జబ్బర్, ఇమాం, ఫారుక్ తదితరులు పాల్గొన్నారు.



