రక్తదానం మహాదానం
:రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి.
:రక్తదానం తో మరొకరి ప్రాణం కాపాడవచ్చు: సిఐ శివశంకర్
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 24(ప్రతినిధి మాతంగి సురేష్): పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలలో భాగంగా పోలీసు అమరవీరుల త్యాగాల జ్ఞాపకార్థం శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ హస్పటల్ లో జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాలతో కోదాడ డిఎస్పి మామిళ్ళ శ్రీధర్ రెడ్డి అధ్వర్యంలో మెగారక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని కోదాడ సిఐ శివశంకర్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ దశరథ తో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాల స్మారకంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు.

పోలీసుల త్యాగాలు బలిదానాలను ప్రజలు గుర్తించాల ని శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులతో భాగస్వామ్యం కావాలని తెలిపారు. రక్తదానం ప్రా ణదానమని ప్రమాదాల బారిన పడిన క్షతగాత్రులకు అత్యవసర సమయంలో ఎందరో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితి రాకుండా దాతలు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యులు లక్ష్మణ్, అభిరామ్, సుష్మ, కోదాడ పట్టణ ఎస్సై సుధీర్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, హాస్పటల్ సిబ్బంది పోలీస్, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు సీఐ చేతుల మీదుగా అందజేశారు.



