రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసిన రక్తదాతలకి సత్కారం
కోదాడ ముస్లిం జేఏసీ
Mbmtelugunews//కోదాడ,జూన్ 14(ప్రతినిధి మాతంగి సురేష్):ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్బంగా రక్తదానం మీద అవగాహనా కార్యక్రమం నిర్వహించుట జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడుతూ రక్తం దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని,రక్త దానం చేయడం వలన ఎటువంటి అనారోగ్యం కలగదని రక్తం ఇవ్వడం వలన కొత్త రక్తం 7 వారాలలో తిరిగి ఏర్పడుతుంది కావున ఆరోగ్యవంతులు అందరూ రక్త దాతలుగా మారాలని రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేసి ప్రాణాలు కాపాడిన వారి సేవలను కొనియాడారు.రక్త దాన శిబిరాలను ఏర్పాటు చేసిన గుండెపంగు రమేష్,ఎంబిఎం బ్లడ్ డోనర్స్ గ్రూప్ మాతంగి సురేష్ ,A 1 బ్లడ్ డోనర్స్ గ్రూప్ నజీర్,హర్షిత బ్లడ్ డోనర్స్ గ్రూప్ సురేష్ ,ప్రతిభా బ్లూమ్స్ స్కూల్ గ్రూప్ ఎండి షేర్ అలీ,దొరకుంట ముస్లిం బ్లడ్ డోనర్స్ గ్రూప్ షఫీ ,కోదాడ ముస్లిం జేఏసీ బ్లడ్ డోనర్స్ గ్రూప్ గులాం సుభాని,స్వర్ణ భారతి ట్రస్ట్ వారిని మరియు రక్త దాతలను ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనారిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు పంది తిరపయ్య,కాంగ్రెస్ నాయకులు గంధం పాండు,ఓరుగంటి కిట్టు,కోదాడ నియోజకవర్గ ఫాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడు యేషయ్య,షేక్ రహీం,కాంగ్రెస్ నాయకులు జహీర్,మైనార్టీ నాయకులు గులాం ఎస్దాని,డాక్టర్ ఇక్బాల్,జమాత్ ఎ ఉలేమా హింద్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ ఖాదిర్ రషాది,స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు నీలా సత్యనారాయణ,జమాతే ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షులు ఖాజామియా,ముస్తాక్,కోదాడ డయాగ్నస్టిక్ జానీ మియా,కాంగ్రెస్ నాయకులు బాబా,బడుగుల సైదులు,మోదలగువారు పాల్గొన్నారు.