రక్షబంధన్ తో పాటు వృక్షబంధన్ జరుపుకోవాలి:చారుగుండ్ల రాజశేఖర్
Mbmtelugunews//కోదాడ,ఆగష్టు 20 ప్రతినిధి మాతంగి సురేష్:రాఖీ పండుగ అంటే తొడబుట్టిన వారికీ రాఖీ కట్టడం సాధారణం.రాఖీ కట్టిన అనంతరం తొడబుట్టిన వారి ఇంటి స్థలాలలో మొక్కలు నాటి వాటికి రాఖీలు కట్టినట్లయితే తొడబుట్టిన వారు నెక్స్ట్ రాఖీ పండగ వరకు ఆ మొక్కను తొడబుట్టిన వారిని చూచినట్లు పెంచినట్లయితే మనచుట్టూ మనకి ఆక్సిజన్ ఇస్తూ, ఆహారం ఇచ్చే ‘ఆకుపచ్చని మొక్కలు’ కూడా మన తొడబుట్టిన వారిలాగా సంరక్షించాలని ప్రతి సంవత్సరం మొక్కలకు రాఖి కట్టి,వాటి ప్రాధాన్యత తెలిపేలా విజయీభవ ట్రస్ట్ కోదాడ ద్వారా వినూత్న ‘వృక్షాబంధన్’ కార్యక్రమం నిర్వహించుట జరిగింది.విజయీభవ ట్రస్ట్ వ్యవస్థాపకులు చారుగుండ్ల రాజశేఖర్ పర్యావరణ ప్రేమికునిలా ప్రచారం చేస్తున్నారు.పచ్చని మొక్కల ప్రాధాన్యత తెలిపేలా కార్యక్రమం నిర్వహించుట జరిగిందని అన్నారు.