రజతోత్సవాలకు మాదిగలు అధిక సంఖ్యలో తరలిరావాలి…..
:దండోరా రజతోత్సవాల కరపత్రం ఆవిష్కరణ…..
:దండోరా రజతోత్సవాలను విజయవంతం చేయాలి……
కోదాడ,జూన్ 26(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:జులై 7న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే మాదిగ,మాదిగ ఉప కులాల దండోరా రజతోత్సవాల విజయవంతానికై మాదిగలు అధిక సంఖ్యలో తరలిరావాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతా బాబు మాదిగ అన్నారు.బుధవారం కోదాడ పట్టణంలో రాష్ట్ర అధ్యక్షులు మేడి. పాపయ్య ఆదేశాల మేరకు కోదాడ నియోజకవర్గ ఇన్చార్జి బాణాల అబ్రహం,పట్టణ అధ్యక్షులు ఏర్పుల చిన్ని అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రజతోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.మాదిగ దండోరా ఉద్యమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా ఏర్పడి ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే క్రమంలో ఎంతోమంది అమరులైనారని తెలిపారు.గ్రామాల్లో,మండలాల్లో, నియోజకవర్గాల్లో,జిల్లా కమిటీలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంఘం బలోపేతంగా ఉందన్నారు.రజతోత్సవాలకు మాదిగలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బొల్లె పోగు స్వామి మాదిగ,ఎమ్మెస్ నాయకులు పిడమర్తి బాబు,కోదాడ మండల అధ్యక్షులు నారకట్ల . ప్రసాద్,చిలుకూరు మండల అధ్యక్షులు కందుకూరు నాగేశ్వరరావు,చింత వినయ్,అమరబోయిన ప్రభు,చంటి,గుండెపొంగు సిసింద్రీ,కందుకూరి తిరుపతి,కుడుముల ఎర్ర శీను,పంది వెంకటి, సోమపంగు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు……….