రజనీకాంత్ సినిమాలో నాగార్జున
Mbmtelugunews//సినిమా, ఆగష్టు 30:రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కూలీ’.ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నట్టు చిత్ర బందం వెల్లడించింది.నటుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేసింది.ఇందులో నాగార్జున నటించే అవకాశాలున్నాయంటూ కొన్ని రోజుల క్రితం ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.దానిపై స్పందించని టీమ్ తాజాగా అభిమానులను సర్ప్రైజ్ చేసింది.’ఖైదీ’ సమయం నుంచి నీతో కలిసి పనిచేయాలనుకున్నా.’కూలీ’లో భాగమవడం ఆనందంగా ఉంది”అని నాగార్జున ట్వీట్ చేశారు.అక్రమ రవాణా మాఫియా నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. ‘మంజుమ్మల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్ ఇందులో ఓ పాత్ర పోషిస్తున్నారు.మరోవైపు,బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ అతిథి కనిపించనున్నారనేది కోలీవుడ్ టాక్.’వేట్టయాన్’తో త్వరలోనే ప్రేక్షకులను పలకరించనున్నారు రజనీకాంత్.టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబరు 10న విడుదల కానుంది. ప్రస్తుతం ‘కుబేర’తో బిజీగా ఉన్నారు నాగార్జున.శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ధనుష్ మరో హీరో.