రన్ ఫర్ జీసస్ బ్రోచర్ విడుదల
Mbmtelugunews//కోదాడ, మర్చి 24(ప్రతినిధి మాతంగి సురేష్): గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండగల సందర్భంగా ప్రతి సంవత్సరం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ట్రెజరర్ ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గం కలిసికట్టుగా ఘనంగా ర్యాలీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమ బ్రోచర్ విడుదల చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కోర్ కమిటీ చైర్మన్ డాక్టర్ శ్రావణ్ కుమార్, డిసిప్లిన్ కమిటీ చైర్మన్ రెవ డాక్టర్ వి యేసయ్య, వైస్ చైర్మన్ గుడిబండ ఎషయ్య, కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ అధ్యక్షులు బ్రదర్ రామారావు, గౌరవ సలహాదారు డేవిడ్ రాజారావు, వర్క్ ఇన్ ప్రెసిడెంట్ రమేష్, శ్రీనివాసగౌడ్, సెక్రటరీ కొర్నేలీ, పాస్టర్ పాలు చారి, మోతే ప్రెసిడెంట్ లాజర్, పాస్టర్ యూత్ అధ్యక్షులు సురేష్, పాస్టర్ రూపస్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.



