రవీంద్రభారతి లో ఖానాపురం సర్పంచ్ కంటు లాజర్ కు ఘనసన్మానం
Mbmtelugunews//అనంతగిరి, డిసెంబర్ 30( ప్రతినిధి మాతంగి సురేష్): తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సభ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ముదిరాజు సర్పంచులను సత్కరించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు. బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ముదిరాజ్, ఎమ్మెల్సీ విఆర్ఎస్ బండ్ల ప్రకాష్ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ సీనియర్ అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ లు పాల్గొని గ్రామపంచాయతీ ఎన్నికలలో విజయం సాధించిన ముదిరాజ్ సర్పంచ్ లను ఘనంగా సన్మానించారు. దీనిలో భాగంగా అనంతగిరి మండల పరిధిలోనే ఖానాపురం గ్రామ సర్పంచ్ కంటు లాజరును హైదరాబాదులోని రవీంద్ర భారతిలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచులు గ్రామాలలో మంచి పరిపాలన అందించి గ్రామ ప్రజల మన్ననలు పొందాలని అన్నారు.



