కోదాడ,అక్టోబర్ 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ టిఆర్ఎస్ అసమ్మతి నేతలను కలిసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మాజీ పీసీసీ చీఫ్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు బిఆర్ఎస్ పార్టీ నుండి బీఫాము ఇవ్వడంతో అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు, బిఆర్ఎస్ మాజీ నియోజకవర్గ ఇన్చార్జ్ కన్మంతరెడ్డి శశిధర్ రెడ్డి,బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎర్నేని వెంకటరత్నం (బాబు),మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు,ఇతర ముఖ్యమైన నాయకులు గత కొన్ని నెలలుగా అధిష్టానానికి తమ అసమ్మతి గళాన్ని వినిపిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.బిఆర్ఎస్ అధిష్టానం మల్లయ్య యాదవ్ కు బిఫామ్ ఇవ్వడంతో అసమ్మతి నాయకులు అలక పూనారు.మంగళవారం ఉత్తమ్ కుమార్ రెడ్డి,చందర్ రావు ను శశిధర్ రెడ్డిలను కలిసి తమ పార్టీలోకి రావలసిందిగా ఆహ్వానించారు. అంతేకాకుండా చందర్ రావు నివాసంలో భోజనం కూడా చేశారు.కాని అసమ్మతి నాయకులు ఇంకను వారి అభిప్రాయాన్ని వెలువరించలేదని సమాచారం.కొంతమంది నాయకుల నుంచి వినిపిస్తున్న మాటలు మేమందరం కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సుముఖంగా ఉన్నామని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రసవత్తరముగా మారుతున్న కోదాడ రాజకీయం
RELATED ARTICLES



