రాంబాబు మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు:బత్తినేని
Mbmtelugunews//కోదాడ,జూన్ 14(ప్రతినిది మాతంగి సురేష్): కోదాడ మున్సిపల్ పరిధిలోని తమ్మర బండపాలెం గ్రామానికి చెందిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు రాయపూడి రాంబాబు మరణం గ్రామ శాఖ పార్టీకి తీరని లోటని సిపిఐ కోదాడ మండల కార్యదర్శి బత్తినేని హనుమంతరావు,గ్రామ శాఖ కార్యదర్శి మాతంగి ప్రసాదు,ఎఐటియుసి ప్రాంతీయ నాయకులు పోతురాజు సత్యనారాయణలు అన్నారు.రాంబాబు శుక్రవారం అకాల మరణం చెందటంతో శనివారం కమ్యూనిస్టు పార్టీ నాయకులు మృతుని నివాస గృహానికి వెళ్లి మృతుని పార్ధువదేహంపై ఎర్రజెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాంబాబు కుటుంబం అంతా కమ్యూనిస్టు పార్టీలో పని చేస్తూ పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి గ్రామంలో పార్టీ బలోపేతానికి కృషి చేసారని తెలిపారు.మృతుడు రాంబాబు తల్లి రాయపూడి జానమ్మ గతంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తరపున వార్డు నెంబర్ గా గెలిచారని గుర్తు చేశారు.రాంబాబు కుటుంబానికి కమ్యూనిస్టు పార్టీ అన్నివేళలా అండదండలుగా ఉండి ఆదుకుంటామని తెలిపారు.అనంతరం కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు.ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు గొటేముక్కల కోటి నారాయణ,పసుపులేటి గోవిందరావు,అల్వాల్ పురం గ్రామ శాఖ కార్యదర్శి నగేష్ కొండా కోటేశ్వరరావు,నిడిగొండ రామకృష్ణ ,మాతంగి రమేష్ ,బంకా వెంకటరత్నం,మాతంగి సురేష్ ,ఫాస్తం సుందరయ్య,నిడిగొండ రాంబాబు,కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు