సిరిసిల్ల,జులై 06(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తంగళ్లపల్లిలోని వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇందులో భాగంగానే మధ్యాహ్నం పోడు భూముల పట్టాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఇటీవలే కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా 1.50 లక్షల మంది రైతులకు పోడు పట్టాలు పంపిణీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే పట్టాలు పొందిన ఆదివాసీ రైతులకు రూ.23.56 కోట్లు విలువ చేసే రైతుబంధు చెక్కులను అందించామని వివరించారు. రాష్ట్రంలో నాలుగు లక్షలకు పైగా ఎకరాల్లో.. పోడు పట్టాలు ఇస్తున్నామని చెప్పారు. ఇక నుంచి ఈ భూములకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని.. విద్యుత్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. పోడు భూముల్లో ఆదివాసీలు బోర్లు వేసుకునేందుకు గిరివికాసం పథకం కింద.. ప్రభుత్వం బోర్లను వేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు.మరోవైపు వివిధ జిల్లాలో మంత్రులు,ఎమ్మెల్యేలు పోడు పట్టాలు పంపిణీ చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోడు పట్టాల పంపిణీ కార్యక్రమంలో కేటీఆర్
RELATED ARTICLES