రాజీ మార్గమే రాజమార్గం:సీనియర్ సివిల్ జడ్జ్ శ్యాం కుమార్
కోదాడ,మే 16(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ పట్టణంలో కోర్టు ఆవరణంలో జూన్ 8న జరిగే లోక్ అదాలత్ పురస్కరించుకొని క్రైమ్ మీటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ సీనియర్ సివిల్ జడ్జ్ శ్యామ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ జూన్ 8న జరగబోయే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని కక్షిదారులు వారి కేసుల పట్ల అవగాహనతో ఉండి రాజీ చేసుకోవాలని సూచించారు.ఇలాంటి లోకదాలతుల వల్ల కక్షి దారులకు వ్యయ ప్రయాసలు ఉండవని,ఇరుపక్షాలు రాజీమార్గంతో వారికి ఉన్న సమస్యలు పరిష్కరించుకోవాలని రాజీమార్గమే రాజమార్గం అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ శ్యాం కుమార్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ సిహెచ్ సత్యనారాయణ,పిపి బొబ్బ కోటిరెడ్డి,బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గట్ల నరసింహారావు,బార్ అసోసియేషన్ సభ్యులు మంద వెంకటేశ్వర్లు,కోడూరు వెంకటేశ్వర్లు,హేమలత,దొడ్డ శ్రీధర్,ఎస్ కె నాగుల్ పాషా,సీనియర్ న్యాయవాదులు వి రంగారావు,సిలివేరి వెంకటేశ్వర్లు,షేక్ అబ్దుల్ రహీం,ఉయ్యాల నరసయ్య,రంజాన్ భాష,రియాజ్,బాలయ్య,శరత్ కుమార్,మండల లీగల్ సెల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



