రాత్రిపూట వాహనదారులు రోడ్లపై జాగ్రత్తగా వాహనాలు నడపాలి
Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 10(ప్రతినిధి మాతంగి సురేష్)వాహనాలు నడిపే వాహనం దారులారా ఏప్రిల్,మే,జూన్ మాసాలలో రైతులు వారి యొక్క గేదెలు ఆవులను మొదలు పెడుతుంటారు అవి రాత్రి సమయంలో రోడ్లమీద తిరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్క వాహనదారుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.బైకు నడిపిటోలు గాని ఆటోడ్రైవర్లు గాని కార్ డ్రైవర్ గాని వీరు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా వాహనాలు నడపాలి గేదెలు ఆవులు రోడ్లమీద తిరుగుతాయి కాబట్టి అవి రాత్రిపూట వేళలో మనకు కనబడవు మనం వాటిని ఢీకొనటం వల్ల మన ప్రాణాలకు హాని ఉంది కాబట్టి డ్రైవర్లు అందరు కూడా నిదానంగా నడపవలసిన కోరుతున్నాం.మనం ఇంటి నుంచి వాహనం తీసుకొని బయటికి వెళ్లినప్పుడు మన భార్య పిల్లలు తల్లిదండ్రులు మన కోసం ఎప్పుడొస్తాడా అని ఎదురుచూస్తూ ఉంటారు మనం మన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని చాలా జాగ్రత్తగా ఈ మూడు నెలలు వాహనాలు జాగ్రత్తగా నడపాలి.మనకి జరగరాని సంఘటన జరిగితే మన పిల్లలు భార్య కుటుంబం అంతా అనాదులుగా మిగిలిపోతారు దీన్ని దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ 50 నుంచి 60 లోపే డ్రైవింగ్ చేసి సురక్షితంగా ఇంటికి చేరాలని ముస్లిం మైనారిటీ సెల్
ఉపాధ్యక్షులు షేక్ నజీర్ కోరారు.