రానున్న కాలంలో నిరుద్యోగ సమస్యలపై పోరాటాలు కి యువత సిద్ధం కావాలి: కాసాని కిషోర్
కోదాడ,మార్చి 23(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:దేశంలో నిరుద్యోగం,పేదరికం లేని సమాజం కోసం కృషి చేయటమే భగత్ సింగ్ కి ఘనమైన నివాళి అని డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ అన్నారు.నడిగూడెం మండల కేంద్రంలో సుందరయ్య భవన్లో భగత్ సింగ్ వర్ధంతి నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ హాజరై మాట్లాడుతూ దేశంలో పేదరికం నిరుద్యోగం అసమానతలు లేని సమసమాజ కోసం కృషి చేయటమే భగత్ సింగ్ కి ఘనమైన నివాళి అని తెలిపారు.భగత్ సింగ్ చనిపోయి నేటికీ 93 సంవత్సరాలు అయిందని గుర్తు చేశారు.భగత్ సింగ్ చేసిన త్యాగాలు నేటి యువత గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వివరించారు.భగత్ సింగ్ అంటే యువతకు ఉత్తేజమని ప్రతి ఒక్కరు భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకొని నేటి సమాజంలో జరుగుతున్న అసమానతలు దోపిడి పైన నిర్వహించే పోరాటాల్లో యువత ముందుండాలని ఆయన తెలిపారు.భగత్ సింగ్ కలలు కన్నా సమాజం నేడు లేదని నేటి కార్పొరేట్,పెట్టుబడిదారు లు లాభాల కోసం యువతను గంజాయి,డ్రగ్స్,మత్తు పదార్థాల,చెడు వ్యసనాల వైపు తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు.దీనివల్ల యువత మొత్తం పెడదారులు పట్టి ఆగమైపోతున్నారని భగత్ సింగ్ స్ఫూర్తితో యువతని సక్రమమైన మార్గాల్లో తీసుకురావడం కోసం భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ అనేక పోరాటాలు చేస్తుందని ఈ పోరాటాలు లో యువత మొత్తం కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు కొరట్ల బ్రహ్మయ్య,కాసాని రాంబాబు,వినోద్,ఉపేందర్,చంటి,గణేష్,వంశీ తదిరులు పాల్గొన్నారు.



