రాబోయే వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చేయడమే లక్ష్యం
Mbmtelugunews//నడిగూడెం, ఫిబ్రవరి 25(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామపంచాయతీ పరిధిలో రాబోయే వేసవి కాలమును దృష్టిలో ఉంచుకొని ఎటువంటి త్రాగునీటి సమస్యలు లేకుండా ముందస్తు చర్యలలో భాగంగా సర్పంచ్ గోసుల రాజేష్ అధ్యక్షతన విడబ్ల్యూఎస్సీ కమిటీ సమావేశము ఏర్పాటు చేసి గ్రామములో త్రాగునీటి సమస్యలు, మిషన్ భగీరథ పైపులైను రిపేర్లు నూతన పైపులైను ఏర్పాట్ల గురించి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నడిగూడెం ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరూ ఫీల్డ్ సర్వే నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులతో ఫీల్డ్ సర్వే నిర్వహించామని తెలిపారు. గ్రామ ప్రజలు వేసవికాలంలో నీటిని పొదుపుగా వాడుకోవాలని తెలిపారు. ఈ సమావేశమునకు సర్పంచ్ తో పాటు ఆర్డబ్ల్యుసిఏఈ నడిగూడెం, విడబ్ల్యూఎస్సీ కమిటీ సభ్యులు, వార్డు మెంబర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



