రామాపురం బోర్డర్ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన బర్డ్ ఫ్లూ చెక్ పోస్టు సూపర్వైజరీ అధికారి
Mbmtelugunews//కోదాడ,ఫిబ్రవరి 15 (ప్రతినిధి మాతంగి సురేష్):తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు రామాపురం క్రాస్ రోడ్డు వద్ద పశుసంవర్ధక మరియు పశువైద్య శాఖ,పోలీస్ శాఖ వారి సంయుక్త చెక్ పోస్టు పనితీరు ఆకస్మిక తనిఖీ చేసిన సూపర్వైజరీ ఆఫీసర్ మరియు ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా పై పెంటయ్య.శనివారం 8 కోళ్లు రవాణా వాహనాలు 17000 కోడిపిల్లలు ఆంధ్రనుండి తెలంగాణకు రాకుండా వెనక్కి పంపించిన చెక్ పోస్ట్ టీమ్ ని అభినందించారు.చెక్ పోస్ట్ వద్ద పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ సిబ్బంది,కోదాడ,అనంతగిరి మండలం పశువైద్యాధికారులతో 24 గంటల తనిఖీ ఏర్పాటు చేయడం జరిగింది అని తెలంగాణలోకి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకకుండా శాఖ డైరెక్టర్,జిల్లా కలెక్టర్ ఆదేశాల మేర ఆంధ్ర నుండి తెలంగాణకు కోళ్ల వాహనాలు కోళ్లు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

జిల్లాలో కోళ్ల సంరక్షణకు ఎప్పటికప్పుడు కోళ్ల యజమానులతో మాట్లాడుతూ వ్యాధిసోకకుండా ముందస్తు సూచనలు చేస్తూ జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక అధికారి నిరంతరం జిల్లా అంతటా పర్యవేక్షిస్తున్నారని,ప్రజలు పౌల్ట్రీ యజమానులు ఎవ్వరూ బర్డ్ ఫ్లూ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.తనిఖీ సందర్భంగా అనంతగిరి మండల పశువైద్యాధికారి డా సురేందర్,కట్టకొమ్ముగూడెం పశువైద్యాధికారి డా శ్రీనివాస్ సిబ్బంది శరత్ పవన్ తదితరులు పాల్గొన్నారు.