Sunday, July 6, 2025
[t4b-ticker]

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కోదాడ మార్కెట్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాం

రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కోదాడ మార్కెట్ ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తాం

:గత పది ఏళ్లలో పండని పంట వానాకాలం పండింది

:అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తాం

:కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియ

:రేషన్ కార్డులు పూర్తి అయినాక ప్రతి రేషన్ కార్డుదారునికి నాణ్యమైన సన్నబియ్యాన్ని ఉచితంగా అందిస్తాం

:పాలేరు రిజర్వాయర్ నుండి మోతే మండలానికి లిఫ్ట్ ద్వారా నీరు అందిస్తాం

:పొలం లేని ప్రతి పేదవారికి ఇందిరమ్మ రైతు భరోసా కింద సంవత్సరానికి 12000 అందిస్తాం

:ఇందిరమ్మ ఇళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాం ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షలు ఇస్తాం

:కోదాడ నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తాం

:కోదాడ నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

:మా జీవితం కోదాడ నియోజకవర్గ ప్రజలకు అంకితం

:నీటిపారుదల,పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Mbmtelugunews//కోదాడ,జనవరి 23 (ప్రతినిధి మాతంగి సురేష్):కోదాడ మార్కెట్ను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తీర్చి దిద్దడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని నీటిపారుదల పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు అన్నారు.కోదాడ నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారాన్ని మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఉత్తమ్, తుమ్మల,ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి లు పాల్గొన్నారు. ముందుగా నూతన పాలకవర్గాన్ని కార్యదర్శి రాహుల్ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ కోదాడ మార్కెట్ ను రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తీర్చిదిద్దుతానని అన్నారు. రాష్ట్రంలో 66.7 లక్షల ఎకరాలలో 1505 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసింది సన్నబియానికి కింటాకు 500 రూపాయలు బోనస్ ఇచ్చిందని అన్నారు.గత 10 ఏళ్లలో పండని పంట మొన్న వానాకాలం పండిందని ఈ రవి పంటలో కూడా ఎక్కువ ధాన్యం పండుతుందని అన్నారు. ఈ రవి పంటలో కూడా ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది సన్నబియానికి కింటాకు 500 రూపాయలు బోనస్ ఇస్తుందని అన్నారు. కొత్త రేషన్ కార్డుల విషయంలో ఎవరు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు సివిల్ సప్లై మంత్రిగా నేను మీకు మాటిస్తున్నాను అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు వస్తుందని ఈ రేషన్ కార్డు నిరంతర ప్రక్రియ అని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం గత పది ఏళ్లలో 45 వేల కార్డులు మాత్రమే ఇచ్చారని అది ఉప ఎన్నికల జరిగే ప్రాంతాలలోనే ఇచ్చారని అన్నారు.

రాష్ట్రంలో 72% జనాభాకు ఆహార భద్రత కల్పించే విధంగా ఉచితంగా రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యాన్ని అందిస్తామని అన్నారు.అర్హత ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని ప్రజాపాలనలోప్రజావాణిలో,ఈ సేవ ద్వారా దరఖాస్తు పెట్టుకున్న వారికి, గ్రామ సభలలో దరఖాస్తు చేసుకున్న వారికి కూడా ఇస్తామని అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి అందిస్తామని అన్నారు.ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు అందిస్తామని అన్నారు. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12 వేల రూపాయలు రైతుకు ఈనెల 26వ తారీకు నుండి ప్రారంభిస్తామని భూమిలేని రైతు కూలీలకు ఇందిరమ్మ రైతు భరోసా కింద సంవత్సరాకు 12000 అందిస్తామని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క,మంత్రులం నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నామని అన్నారు. కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము మా జీవితం కోదాడ నియోజకవర్గ ప్రజలకు అంకితం కోదాడ నియోజకవర్గ ప్రజలు బాగుపడి ఆర్థికంగా అభివృద్ధి చందాలనే సంకల్పంతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా 100 పడకల హాస్పిటల్,250 కోట్ల రెసిడెంట్ స్కూలు ,అంతర్గత రోడ్లు,కాలవలు,లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్,గ్రామపంచాయతీ భవనాలు,అంగన్వాడి స్కూల్స్ లకు భూమి పూజలు చేశామని అన్నారు. పాలేరు వాగుకు కృష్ణా జలాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నామని పాలేరు రిజర్వాయర్ నుండి మోతే కు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని అన్నారు. వైద్యం విద్య స్కిల్ స్కీమ్స్ వంటివి మంజూరు చేశామని 18 కోట్లతో కోదాడ ఆర్టీసీ బస్టాండు దిశ మారుతుందని హైదరాబాదు నుండి సూర్యాపేట కోదాడ జగ్గయ్యపేట వరకు సిక్స్ వే రోడ్ లైన్స్ త్వరలో ప్రారంభిస్తారని కోదాడకు రైల్వే లైన్ వచ్చే విధంగా కృషి చేస్తానని అన్నారు.

:మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశానికి కెప్టెన్ గా సేవలందిస్తున్న సమయంలో తన విమానం బ్లాస్ట్ అయ్యి పరాశక్తి ద్వారా అడవులలో దెబ్బలతో పడిపోయి చావుకు దగ్గరగా పోయిన ఉత్తమ్ను బ్రతికించిన దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చి అదే నిబద్ధతతోటి పనిచేస్తున్న ఉత్తమ్ కు రెండు నియోజకవర్గాల ప్రజలు రుణపడి ఉంటారని అన్నారు. తప్పు మాట్లాడకుండా నిబద్ధతతో నిజాయితీతో పనిచేసే ప్రజాప్రతినిధి కి నిదర్శనం పద్మావతి అని అన్నారు. నేను ఉత్తమ్ అభిమానినని అన్నారు రాష్ట్రంలో ఏ మంత్రి కైనా ఉత్తమ్ ఆదేశిస్తే ఆ పని అవుతుందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 8 సంవత్సరాలు బీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని బతికించిన వ్యక్తి ఉత్తమ్ అని అన్నారు. ఈ రాష్ట్రాన్ని ధనవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దటానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ప్రజల ఆలోచనలకు పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. గోదావరి జలాలు పాలేరు రిజర్వాయర్ కి తీసుకొచ్చి రైతాంగ సోదరుల రుణం తీర్చుకుంటానని అన్నారు. 7625 కోట్ల రైతుల బాధను తీర్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ పునరుద్ధరిస్తామని తెలంగాణ సుభిక్షమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని భగవంతుడు ఎంత అవకాశం ఇస్తే అంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని వైద్య,విద్యా,వ్యవసాయం పారిశ్రామికంగా రాష్ట్రాన్ని అగర గ్రామీణలో ఉంచుతామని అన్నారు.

: ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా మంత్రుల సహకారంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తానని అన్నారు.మార్కెట్ కమిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని నూతనంగా ఎంపికైన పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.

: మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏపూరి తిరుపతమ్మ సుధీర్ మాట్లాడుతూ నా కుటుంబాన్ని నమ్మి నాకు మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా కేటాయించిన మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి లకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. నిస్వార్ధంగా నీతిగా నిజాయితీగా అవినీతికి తావు లేకుండా పాలకమండలి సహకారంతో మార్కెట్ ను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని మార్కెట్ కు పూర్వవైభవం తీసుకురాటానికి మా పాలకమండలి మొత్తం శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు. మంత్రి ఉత్తమ్,ఎమ్మెల్యే పద్మావతి ల సహకారంతో మరిన్ని నిధులు తీసుకొస్తామని తెలిపారు.నాతోపాటు ప్రమాణస్వీకారం చేసిన పాలకమండలి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు,మాజీ ఎమ్మెల్యే చందర్ రావు,టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి,మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్,వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్,ఎర్నేని బాబు,పార సీతయ,కందుల కోటేశ్వరరావు,జబ్బార్,అల్తాఫ్ హుస్సేన్,ముస్కు శ్రీనివాసరెడ్డి,కొణతం శ్రీనివాసరెడ్డి,కే ఎల్ ఎన్ ప్రసాద్,మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular