రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల నరేష్ రెడ్డి మృతి బాధాకరం:మాజీ సర్పంచ్ ఎర్నేని
కోదాడ,అక్టోబర్ 05(ప్రతినిధి మాతంగి సురేష్)ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు నూకల నరేష్ రెడ్డి మృతి బాధాకరమని మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు అన్నారు.శనివారం ఆయన వారి నివాసంలో అనారోగ్యంతో మృతి చెందారు వారి భౌతిక కాయానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించి.మాట్లాడుతూ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎదుగుదలకు ఎంతో కృషి చేశారని బడుగు బలహీన వర్గాల ప్రజల వారి సంక్షేమానికి అహర్నిశలు పని చేశారని వారు మృతి చాలా బాధాకరమని కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని అన్నారు.ఈ కార్యక్రమంలో వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు రావెళ్ల కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.