రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని సక్రమంగా పిల్లలకు అందించాలి:సర్పంచ్ గోసుల రాజేష్
Mbmtelugunews// నడిగూడెం, మార్చి 04: నడిగూడెం మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామంలో అంగడి వాడి సెంటర్ ను విజిట్ చేసిన సర్పంచ్ గోసుల రాజేష్. అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని పిల్లలు, బాలింతలు, గర్భిణీ స్త్రీలు మహిళలతో కలిసి భోజనం చేసిన సర్పంచ్ గోసుల రాజేష్. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి సెంటర్ల ద్వారా అందిస్తున్న పౌష్టిక ఆహారాన్ని సక్రమంగా బాలింతలకు, గర్భిణీలకు, పిల్లలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ పప్పుల భాగ్యమ్మ, ఆయా, పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.



