హుజూర్ నగర్,జులై 04 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ అందజేస్తున్న ఉచిత నోటు పుస్తకాలను పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమానికి హుజూర్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్ గెలీ అర్చన రవి ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థిని విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలను పంపిణీ చేశారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఉచిత నోటు పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందజేయడం అభినందనీయం అన్నారు.అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేసిన నోటు పుస్తకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరినారు.ఈ కార్యక్రమంలో 5 వార్డు కౌన్సిలర్ దొంగరి మంగమ్మ,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మల్లెల ఉదయశ్రీ,ఉపాధ్యాయులు శ్రీనివాస్,మాతంగి ప్రభాకర్ రావు ,ఉపేందర్,దీనారాణి,అరుణరాణి,శేషగిరి,సుజాత,అన్వేష్,వసంతరావు,అశోక్ కుమార్,మున్ని బేగం,నాగేశ్వరరావు,శ్రీకాంత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉచిత నోటి పుస్తకాలను సరఫరా చేయడం అభినందనీయం మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన
RELATED ARTICLES