రుణమాఫీలో సమస్యపై వ్యవసాయ మంత్రి అరా
Mbmtelugunews//హైదరాబాద్,ఆగస్టు 24 ప్రతినిధి మాతంగి సురేష్:రుణమాఫీలో తలెత్తిన సమస్యలపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అరా తీశారు.2 లక్షలలోపు కుటుంబ నిర్ధారణ లేని 4 లక్షల 24 వేల 873 ఖాతాదారుల సమాచారాన్ని సేకరింరుంచ నుందని.. ఒక కొత్త యాప్ లో వివరాలు సేకరిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఆధార్ వివరాలు తప్పుగా నమోదైన లక్షా 24 వేల 545 ఖాతాలలో ఇప్పటికే 41 వేల 322 ఖాతాలను అధికారులు సరిచేశారు. ఇప్పటికే వివిధ బ్యాంకు లలో ఉన్న ఖాతాదారుల అకౌంట్ లలో ప్రభుత్వం ద్వారా జమ చేయబడిన మొత్తాలను రైతులకు వెంటనే అందేటట్లు మంత్రి అదేశించారు.
మిగిలిన ఖాతాదారులకు కూడా కొత్త రుణాలు వెంట నే మంజూరు చేయవల్సిందిగా సొసైటీలకు,బ్యాంకు ప్రతినిధులకు మంత్రి సూచించారు.