రూ.2.25 కోట్ల విలువైన 900 వందల కిలోల గంజాయి స్వాధీనం.
Mbmtelugunews//ఆదిలాబాద్ జిల్లా,సెప్టెంబర్ 26:అంతరాష్ట్ర గంజాయి ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ తెలిపారు.ఆంధ్ర, ఒడిస్సా సరిహద్దుల గుండా మహారాష్ట్రలోని బుల్దాన, దులే జిల్లాలకు తరలిస్తున్న గంజాయి కంటైనర్ ను తలమడుగు మండలం లక్ష్మిపూర్ చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నమన్నారు.దాదాపు 900 వందల కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నమని పట్టుబడ్డ గంజాయి విలువ రూపాయలు 2.25 కోట్లు ఉంటుందన్నారు. 8 మంది నిందితులపై కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.



