Wednesday, February 4, 2026
[t4b-ticker]

రెండు రాష్ట్రాలకు వారధిగా పెరిక భవన్ నిర్మాణం చేయాలి

రెండు రాష్ట్రాలకు వారధిగా పెరిక భవన్ నిర్మాణం చేయాలి

:సూర్యాపేట జిల్లా పెరిక సంఘం అధ్యక్షుడిగా సముద్రాల రాంబాబు.

:రాష్ట్రంలో పెరికకుల కార్పొరేషన్ ఏర్పాటుకు నా వంతు కృషి చేశాను.

:సూర్యాపేటలో పెరిక భవన్ నిర్మాణానికి నా వంతు సహకారం ఉంటుంది.

:పెరిక కుల సూర్యాపేట జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో కుల ముద్దుబిడ్డ, రాష్ట్ర వికలాంగుల కార్పోరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య.

Mbmtelugunews//కోదాడ, జనవరి 11(ప్రతినిధి మాతంగి సురేష్): సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెద్దలు జుట్టుకొండ సత్యనారాయణ, అంగిరేకుల నాగార్జున సహకారంతో గత ప్రభుత్వంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో పెరిక భవన్ ఏర్పాటుకు సాధించుకున్న ఎకరం స్థలంలో చేపట్టే పెరిక నిర్మాణం రెండు రాష్ట్రాలకు వారధిగా జాతీయ రహదారి 65 పై ఉండబోతుందని పెరికకుల ముద్దుబిడ్డ, రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. ఆదివారం రాత్రి కోదాడ పెరిక హాస్టల్ భవనంలో ఏర్పాటుచేసిన సూర్యాపేట జిల్లా కుల విస్తృతస్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సూర్యాపేట జిల్లా పెరిక సంఘం అధ్యక్షుడిగా సముద్రాల రాంబాబును ఏకగ్రీవంగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. తాను సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా ఉంటూ పార్టీ అధినాయకులతో మాట్లాడి మన కులానికి కార్పొరేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చిన తర్వాతనే తాను ప్రచారానికి వెళ్లినట్లు తెలిపారు. అధికారం చేపట్టిన తర్వాత తమ కులానికి అనుకున్న ప్రకారం పెరిక కార్పొరేషన్ ఇవ్వాలని కోరగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ అధినాయకులు మీకు వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కావాలా పెరికల కార్పొరేషన్ చైర్మన్ కావాలా అని అడిగితే తాను పెరిక కార్పొరేషన్ చైర్మన్ పదవి కోరుకుంటే మన కులానికి చెందిన మరొకరికి పదవి వచ్చే అవకాశం ఉండదని ఆలోచించి మన కులానికి మరో కార్పొరేషన్ పదవి రావాలని ఆలోచనతో తాను వికలాంగుల కార్పొరేషన్ పదవి కోరుకున్నట్లు తెలిపారు. కులం గురించి ఆలోచించడం తప్ప తనకు వేరే తెలియదని ఈ కులంలోనే పుట్టాను ఈ కులంలోనే పోతాను ఉన్నంతకాలం కుల అభివృద్ధికి పాటుపడతాను అన్నారు. ఈ జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శిష్యుడనని చెప్పేందుకు తాను గర్వపడతానని అన్నారు. హైదరాబాదులో ఖైరతాబాద్ లో ఉన్న భవనం కట్టిన వారి కాళ్లు కడగాలని గాంధీభవన్ కు వెలుతుంటే ప్రతి ఒక్కరికి ఆ భవనం మన ఆత్మ గౌరవాన్ని చాటుతుందన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆత్మగౌరవ భవనాన్ని మన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పూర్తి చేయాలని చేద్దామని అన్నారు. మనము పార్టీలకు పుట్టలేదు కానీ కులానికి అయితే పుట్టామని జిల్లా పెద్దలు జుట్టుకొండ సత్యనారాయణ, అంగిరేకుల నాగార్జున ఆశీర్వాదాలు మనకుంటే అన్ని సవ్యంగా జరుగుతాయని కోదాడ పెరిక హాస్టల్ కు దీటుగా భవన నిర్మాణం జరగాలన్నారు. పెరిక కార్పొరేషన్ నుంచి, మంత్రులు ప్రభుత్వంతో మాట్లాడి నిధులు ఇప్పించేందుకు కృషి చేస్తాను అన్నారు. కుల ఐక్యత పెరగాలని ఎన్నికల అప్పుడే పార్టీలను అధికారంలో ఎవరు ఉన్న వారి వెంటే ఉండాలని సూచించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారితో అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సూర్యాపేట జిల్లా పెద్దలు వర్గాలకు తావు లేకుండా సమాలోచన చేశారని అన్నారు. జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లతో తనకు సన్నిహిత్యం ఉందని వారి సహకారంతో కులాభివృద్ధికి పాటుపడతానన్నారు. సూర్యాపేట జిల్లా సంఘం ఎన్నికల కమిటీ 12 మంది సభ్యులు సూర్యాపేట నియోజకవర్గనికి అధ్యక్ష పదవి ఇవ్వాలని నిర్ణయించారని సూర్యాపేట నియోజకవర్గం పెద్దలు జుట్టుకొండ సత్యనారాయణ,  అంజరేకుల నాగార్జునలు, పట్టణ కమిటీ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని సమాలోచనలు చేశారన్నారు. ఈ కమిటీ రాష్ట్ర స్థాయి సంఘానికి అనుకూలంగా పనిచేస్తుందని మనం బేషా జాలకు పోకుండా ఐక్యంగా ఉండి భవన నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు.

*సూర్యాపేట జిల్లా పెరిక సంఘం అధ్యక్షులుగా సముద్రాల రాంబాబు*

సూర్యాపేట జిల్లా పెరిక సంఘం అధ్యక్షులుగా పెన్పాడు మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన సముద్రాల రాంబాబును పెద్దల అభిప్రాయాల మేరకు ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తున్నట్లు పెద్దలు జుట్టుకొండ సత్యనారాయణ, అంగిరేకుల నాగార్జున ల సమక్షంలో  వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య ప్రకటించారు. గౌరవ అధ్యక్షులుగా వనపర్తి లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ప్రతిపాక జనార్దన్, యూత్ కమిటీ అధ్యక్షులుగా బుడిగం కిరణ్ కుమార్ లను నియమించినట్లు తెలిపారు. అలాగే సూర్యాపేట పెరిక భవన్ నిర్మాణ కమిటీ గౌరవ సలహాదారులుగా ముత్తినేని వీరయ్య, జుట్టుకొండ సత్యనారాయణ, అంగిరేకుల నాగార్జున, దొంగరి వెంకటేశ్వర్లు, సుంకరి అజయ్ కుమార్, రామినేని శ్రీనివాసులను నియమించారు. వీరంతా ఇతర కమిటీలను ఏర్పాటు చేసుకొని పెరిక భవన నిర్మాణానికి పాటుపడాల్సిందిగా కోరారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular