కోదాడ,జులై 07(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కులవృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు.శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు.ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి అని ఆయన కోరారు.పశు సంపద అభివృద్ధి తోపాటు గొర్రెల పెంపకదారుల జీవితాలలో ప్రభుత్వం వెలుగులు నింపుతుంది అని ఆయన అన్నారు.స్వయం ఉపాధి కల్పన ప్రభుత్వం లక్ష్యం అని ఆయన అన్నారు.సీఎం కెసీఆర్ నాయకత్వంలో మార్గదర్శకంలో గొల్ల కురుమల ఆర్దికాభివృద్దికి గొర్రెల పంపిణి పథకం అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో కిషోర్ కుమార్,ఎంపీపీలు చింతా కవిత రాధారెడ్డి,యాతాకుల జ్యోతి మధుబాబు,సొసైటీ చైర్మన్ ఆవుల రామారావు,వెటర్నరీ జిల్లా ఆఫీసర్ శ్రీనివాస రావు,డాక్టర్లు నాగేంద్రబాబు,అఖిల,రవికుమార్, సురేంద్ర,ఆయా గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు,యాదవ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
RELATED ARTICLES



