Sunday, February 8, 2026
[t4b-ticker]

రెడ్లకుంట గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకారం

రెడ్లకుంట గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకారం

Mbmtelugunews//కోదాడ, జనవరి 24(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని రెడ్లకుంట గ్రామపంచాయతీ అభివృద్ధికి గ్రామ పరిధిలోని అమరావతి ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీవారు గ్రామపంచాయతీ అభివృద్ధికి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వై అనంతరావు రెడ్లకుంట గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగవరపు లక్ష్మణరావుకు 50వేల రూపాయలు విరాళంగా ఇవ్వనైనది. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న అమరావతి ఎలక్ట్రానిక్ మానిటరింగ్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లెల ప్రసాద్, 3 వార్డు మెంబర్ గుండె సత్యనారాయణ, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular