రేపు కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలో జూనోసిస్ డే
:రేబీస్ వ్యాధి నివారణకు కుక్కలు పిల్లులకి ఉచిత టీకాలు.
Mbmtelugunews//కోదాడ, జులై 05 (ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణం ప్రాంతీయ పశువైద్యశాలలో ప్రాణాంతక రేబీస్ వ్యాధి నివారణకు ఉచితంగా టీకాల కార్యక్రమం ఏర్పాటు చేయనైనది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా పశువైద్య, పశు సంవర్ధక అధికారి డా, దాచేపల్లి శ్రీనివాసరావు పాల్గొంటారని ప్రాంతీయ పశువైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ డా, పి పెంటయ్య అన్నారు. అనంతరం డాక్టర్ పి పెంటయ్య మాట్లాడుతూ చికిత్స కన్నా నివారణ మేలన్న సామెత ప్రకారం నేటి సమాజంలో మానవాళితో మమేకమై జీవిస్తున్న పెంపుడు జంతువుల నుండి మానవాళికి సంక్రమించే అంటువ్యాధులలో ముఖ్యమైన ప్రాణాంతక వ్యాధి నివారణకు మూడు మాసాలు దాటిన కుక్కలు, పిల్లలకు ఉచితంగా రేబీస్ నివారణ టీకాలు వేయబడును కోదాడ పట్టణ మరియు పరిసర గ్రామాల జంతు ప్రేమికులు తమ తమ కుక్కలు పిల్లులను ఉచిత రేబీస్ టీకా కార్యక్రమానికి ప్రాంతీయ పశువైద్యశాలకి ఉదయం తొమ్మిది గంటలకు వచ్చి తమ పెంపుడు జంతువుల టీకాలు వేయించి వాటి ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య కోరారు.