కోదాడ,జులై 19 (mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘము,కాపుగల్లు నందు కోదాడ మండలం లోనే 1000 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన ధాన్యము గోదాము నిర్మాణ శంకుస్తాపన కార్యక్రమము చైర్మన్ నంబూరి సూర్యం అధ్యక్షతన జరిగినది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులు గా కోదాడ నియోజకవర్గ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.గోదాము నిర్మాణ శంకుస్తాపన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశములో శాసనసభ్యులు మాట్లాడుతూ గ్రామాలలో రైతులు వారు పండిచిన ధాన్యాన్ని గిట్టుబాటు ధర వచ్చేవరకు,దళారుల చేతులలో మోసపోకుండా గోదాములను వినియోగించుకొవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి చింత కవితారెడ్డి,కాపుగల్లు గ్రామ సర్పంచ్ కాసాని వెంకటేశ్వర్లు,మాజీ సర్పంచ్ తొండపు సతీష్,ఏడీఏ వాసు,మాజీ ఎంపిటిసి గంటా శ్రీనివాస్ మరియు సంఘ డైరెక్టర్లు నల్లూరి రమేష్,బాలేబోయిన వెంకటేశ్వర్లు,ముత్తవరపు వీరయ్య,మల్లెల ఆదినారాయణ,మరియు ఉన్నం హనుమంతరావు,మల్లెల పుల్లయ్య,మందలపు శేషు మరియు కాపుగల్లు,రెడ్లకుంట గ్రామాల రైతులు,సంఘ సిబ్బంది తదిదరులు పాల్గొన్నారు.
రైతులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం:ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
RELATED ARTICLES