రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి…
Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 25(మనం న్యూస్): రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి అని క్రిబ్కో ఎండి ఎస్ ఎస్ యాదవ్, చైర్మన్ సుధాకర్ చౌదరి లను ను పిఎసిఎస్ చైర్మన్లు నంబూరు సూర్యం, డేగ బాబు, బజ్జూరు వెంకటరెడ్డి లు కలిసి గురువారం విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన క్రిబ్కో వార్షికోత్సవ సాధారణ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. ఎకరాకు ఒక్క యూరియా బస్తా కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. యూరియాను పెద్ద మొత్తంలో సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. అనంతరం వారి నీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పిఎసిఎస్ చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.



