కోదాడ,మార్చి 31(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రైతన్నలు రెండవ పంట వేసవి వేసినటువంటివారు అష్ట కష్టాలు పడి మూడు వంతులు నీరందక ఎండిపోయి నాలుగో వంతు వరి ధాన్యం చేతికి అందుతుంటే దానికి గత ప్రభుత్వాల కన్నా ఎంఎస్పీ రేటుకన్నా క్వింటలుకు 500రూపాయల బోనస్ ప్రకటించి కొనుగోలు చేస్తామని హామీఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు రైతుల వద్దనుండి ధాన్యమును కొనుగోలు చేయుట మొదలు పెట్టలేదు.500 ఎంఎస్పి పై పెంచకపోగా బహిరంగమార్కెట్లో ఇప్పటివరకు క్వింటాల్ కు 2800/రూ ధాన్యానికి చెల్లించి కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యాపారులు అందరూకుమ్మక్కై క్వింటలు 1950 రూపాయలకు కొనుగోలు చేయుచున్నారు.దీన్ని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనది.పంటనష్టం జరిగిన రైతులకు నష్టపరిహారం కొరకు నష్టాల అంచనాకు పరిశీలన జరిపించలేదు.సాగునీరు దేవుడు ఎరుగు కనీసం త్రాగునీరు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది మన నియోజకవర్గాన్ని దాటి ఖమ్మం జిల్లా చివరి గ్రామాలకు త్రాగునీరుకై సాటిమంత్రి నీరు తీసుకెళుతున్న ఖమ్మం జిల్లా మంత్రులను చూసైన మన జిల్లా మంత్రులు మన గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల నైన కనీసంనింపాలని తద్వారా పశువులకు మరియు మనుషులకు త్రాగునీరును అందే విధంగా చూడాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది.వారం రోజులలో దీనిని అమలు చేయాలని లేకుంటే బిజెపి కోదాడ నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో రైతులను ప్రజలను రోడ్డు మీదకు తీసుకొచ్చి నిరసనలు చేస్తామని బిజెపి కోదాడ అసెంబ్లీ కన్వీనర్ కనగాల నారాయణ అన్నారు.
రైతులను ఆదుకోవాలి బిజెపి
RELATED ARTICLES



