రైతులను ముంచేసిన మెంథా తుఫాన్
Mbmtelugunews//నడిగూడెం, అక్టోబర్ 30( ప్రతినిధి మాతంగి సురేష్): బృందావనపు రెవిన్యూ పరిధిలో బృందావనపురం, గోపాలపురం గ్రామాల్లో తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ రైతులు, నాయకులతో కలిసి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరా ఒక్కంటికి 40 వేల రూపాయలు నష్టపరిహారం అందించాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అధికారులచే పంట నష్టాన్ని అంచనాలు వేయించాలి.
రైతులను మోన్తా తుఫాన్ ముంచేసిందని డివైఎఫ్ఐ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు
పది రోజుల్లో పొలాలు కోసి దాన్యాన్ని అమ్ముకుని ధనాన్ని చేతికొచ్చి సంతోష్ పడే సమయంలో మెంతో తుఫాన్ మెంతోమొత్తం నాశనం చేసిందని ఆయన వాపోయారు
ఆరుగాలం కష్టపడిన రైతులకు పంట చేతికొచ్చే సమయానికి తుఫాన్ తీవ్ర విషాదాన్ని మిగిలించిందని ఆయన వాపోయారు మండల వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి, పత్తి పంట నష్టం జరిగిందని అధికారులతో పంట నష్టం అంచినా వేయించినష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 40 వేల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అనంతరం ఏఈఓ ఉపేందర్ కి నష్ట వివరాలను తెలియపరిచారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కాసాని రాంబాబు, నాగార్జున, సత్యం, టిడిపి గ్రామ శాఖ అధ్యక్షులు పుట్ట ఆంజనేయులు, బస్వంత్, వెంకన్న తదిరులు పాల్గొన్నారు.



