రైతుల అభిప్రాయాలు ప్రభుత్వం దృష్టికి:జిల్లా సహకార అధికారి ఎస్. పద్మ.
కోదాడ,జులై 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రైతు భరోసా పథకం పట్ల రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు ప్రత్యేక సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సహకార అధికారి ఎస్ పద్మ తెలిపారు.బుధవారం కోదాడ పట్టణంలోని స్థానిక పిఎసిఎస్ కార్యాలయంలో చైర్మన్ ఓరుగంటి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.జిల్లా వ్యాప్తంగా 47 సహకార సంఘాల్లో గత నెల 29 నుండి నేటి వరకు రైతులతో సమావేశాలు నిర్వహించామని ఈ సమావేశాల్లో రైతులు రైతు భరోసా నిధులు 5 ఎకరాలకే పరిమితం చేయాలని,మరికొందరు 10 ఎకరాలకు వరకు ఇవ్వాలని,చిన్న ఉద్యోగస్తులకు వర్తింపజేయాలని,కొండలు,గుట్టలు,రియల్ ఎస్టేట్ భూములు,సాగుకు పనికి రాని భూములకు వర్తింప చేయకూడదని ఇలా భిన్న రకాలైన అభిప్రాయాలను తెలియపరచారని వాటన్నింటినీ నివేదికలు తయారుచేసి ప్రభుత్వానికి పంపిస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ రిజిస్టర్ ఇందిరా,వైస్ చైర్మన్ బుడిగం నరేష్,సీఈఓ మంద వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు వెంకటేశ్వర్లు,ప్రభాకర్ రావు,గుజ్జ బాబు,పార్వతి,శెట్టి. శ్రీనివాసరావు,చంద్రమౌళి,కమతం. వెంకటయ్య,పుల్లయ్య కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.