రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం.
:రుణమాఫీ అయిన రైతులకు కొత్త రుణాలు మంజూరు.
:కోదాడ పిఎసిఎస్ పరిధిలో 1500 మంది రైతులకు ఏడు కోట్ల రుణాలు మాఫీ:కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాసరెడ్డి.
కోదాడ,ఆగష్టు 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.శనివారం పట్టణంలోని పిఎసిఎస్ కార్యాలయంలో వైస్ చైర్మన్ తో కలిసి రుణమాఫీ అయిన రైతులకు తిరిగి కొత్త రుణాలును మంజూరు చేసి చెక్కులను అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘంలో మొత్తం 2380 మంది రైతులు ఉండగా ఇప్పటివరకు 1500 మంది రైతులకు ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వం రుణమాఫీ చేసిందన్నారు.వివిధ కారణాల వల్ల మాఫీ కానీ రైతులకు ఆగస్టు 30 లోపు రైతులందరి రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందన్నారు.సాగర్ లో నీటి నిల్వ డెడ్ స్టోరేజీ లో ఉన్నప్పటికీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఎడమ కాలువ రైతులకు సాగర్ నీటిని విడుదల చేయడం పట్ల రైతులందరి పక్షాన వారికి కృతజ్ఞతలు తెలిపారు.రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అన్నారు.ఈ కార్యక్రమంలో సీఈఓ మంద వెంకటేశ్వర్లు,రైతులు చంద్రశేఖర్ రెడ్డి,వెంకట్ రెడ్డి,నాగలక్ష్మి,దశరథ,తిరపయ్య,విజయ్,ఉపేంద్రమ్మ,నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.