Friday, April 10, 2026
[t4b-ticker]

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.సర్పంచి మందుల నాగయ్య

రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.సర్పంచి మందుల నాగయ్య

Mbmtelugunews//కోదాడ,ఏప్రిల్ 10 (ప్రతినిధి మాతంగి సురేష్): రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని సర్పంచి మందుల నాగయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆర్డీవో సూర్యనారాయణ, సర్పంచి మందుల నాగయ్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసుకొని కేంద్రానికి తీసుకువచ్చిన యెడల ప్రభుత్వ మద్దతు ధర ఏ గ్రేడు క్వింటాల్ రూ2389లు బి గ్రేడ్ రూ2367లు పొందాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, ఉపసర్పంచి ఈర్ల జయసింహారెడ్డి, 5వ వార్డు మెంబర్ వంశీ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఎండి రఫీ, కుక్కడపు సైదులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular