కోదాడ,ఆగష్టు 04(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్రంలో రైతుల గోడు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని వర్షాకాల సీజన్ మొదలై పక్ష్యం రోజులు గడుస్తున్నా నేటికీ సాగర్ ఎడమ కాలవ నీళ్లు రైతాంగానికి ఇవ్వలేదని,ప్రభుత్వం వెంటనే స్పందించి రైతాంగానికి సాగర్ ఎడమ కాలువ కు నీళ్లు విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల సమీపిస్తున్నందున ఎన్నికల స్టంట్ తో రుణమాఫీ ప్రకటన చేస్తుందని, రైతులకు చేసింది ఏమీ లేదని, రుణమాఫీ ఏకకాలంలో రైతులకు రెండు లక్షలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోదాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు లబ్ధిదారులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేకుండా పంపిణీ చేశారని ప్రభుత్వం వెంటనే లబ్ధిదారులకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కోదాడ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో హామీ ఇచ్చి మోతే మండలానికి పాలేరు నుండి లిఫ్ట్ ద్వారా నీరు అందిస్తామని ఎన్నికల హామీలు చెప్పి నేటికీ మర్చిపోయారని బిఆర్ఎస్ నేతలు గత ఎన్నికల హామీలు మరిచి అభివృద్ధి చేశామని ఆర్భాటం చేస్తున్నారని ఆరోపించారు.గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం పడకేసిందని ప్రతి గ్రామపంచాయతీలో నిధుల కొరతతో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం గ్రామాలను గ్రామాల్లో పారిశుద్ధ్యని గాలికి వదిలేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల సమీపిస్తున్నందున ప్రజలకు మాయమాటలు చెప్పి మరొకసారి అధికారంలోకి రావాలని కేసీఆర్ పన్నాగం పన్నుతున్నారని ప్రజలు తెలంగాణ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నంబూరు సూర్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళిత బందు పేరుతో రైతుబంధు పేరుతో ప్రజల్ని మోసగిస్తున్నారని ఎన్నికలు సమీపిస్తుండటంతో మాటల గారడీ చేస్తూ ప్రజలని మభ్యపెడుతూన్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం మద్యంపై ఉన్న శ్రద్ధ సాగినీటిపై లేదని ఆరోపించారు.ఈ సమావేశంలో మునగాల మండల అధ్యక్షులు దోసపాటి రాములు,అనంతగిరి మండల అధ్యక్షులు చేపల శ్రీనివాస్,నల్లగొండ పార్లమెంటు ఉపాధ్యక్షులు కొల్లు నరసయ్య,చిలుకూరు వైస్ ఎంపీపీ జన్నపనేని కృష్ణారావు,రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు శ్రీమన్నారాయణ,సాతులూరు గురవయ్య,సైదిరెడ్డి,బీసీ సెల్ నాయకులు సైదులు,ఎస్టీ సెల్ నాయకులు జీవ్లా నాయక్,భాస్కర్,సైదులు,దుర్గారావు,పల్లపు నాగేశ్వరరావు,మైకు నాగులు,తామస్,నాగిరెడ్డి,వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రైతు గోడు పట్టించుకోని ప్రభుత్వం.:సకాలంలో సాగర్ నీళ్లు విడుదల చేయాలి.:టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఓరుగంటి ప్రభాకర్.
RELATED ARTICLES