రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ
:రైతు ప్రయోజనాలే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.
:నీరు విడుదల చేయాలని సాహసోపేత నిర్ణయం మంత్రి ఉత్తమ్ ది.
:మంత్రి ఉత్తమ్ కు ఎడమకాలువ ఆయకట్టు రైతాంగం రుణపడి ఉంటుంది:కోదాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు
కోదాడ,ఆగష్టు 01(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి నాగార్జునసాగర్ ఎడమ కాలువ రైతాంగం రుణపడి ఉంటుందని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాజీ సర్పంచ్ ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నారు.గురువారం కోదాడ పట్టణంలోని ఆయన నివాసంలో సాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేయాలని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉన్నప్పటికీ రైతు ప్రయోజనాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని అభినందించారు.గత పాలకులు వరి వేస్తే ఉరి అని రైతులను బెదిరించారని కాంగ్రెస్ పార్టీ రైతుల ప్రభుత్వం అన్నారు.
కోదాడ నియోజకవర్గంలో రైతాంగం నష్టపోవద్దని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారని రైతంగం పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేస్తుందని ప్రతిపక్షాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరణను చూసి తట్టుకోలేక లేనిపోని విమర్శలు చేస్తున్నాయని విమర్శించారు.గత ప్రభుత్వంలో మూలన పడ్డ లిఫ్టులు అన్నింటిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిధులు మంజూరు చేసి రైతులకు సాగునీరు అందించాలని పునరుద్ధరిస్తున్నారని కొనియాడారు.యావత్ రైతాంగం కాంగ్రెస్ పార్టీ వెంటే ఉంటుందన్నారు.ఈ సమావేశంలో సాదినేని అప్పారావు,చందు నాగేశ్వరరావు,ఒంటిపులి శ్రీనివాసరావు,పారా వెంకటేశ్వరరావు,నెమ్మది దేవమని,రాయల కృష్ణారావు,భాస్కరరావు,వేమూరి విద్యాసాగర్,రాము,పార్టీ కార్యకర్తలు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.