రైతు రుణమాఫీ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన కోదాడ పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస రెడ్డి.
కోదాడ,జూన్ 23(mbntelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల వరకు రైతులు బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని క్యాబినెట్ మీటింగ్ లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస రెడ్డి ఆదివారం ఓ ప్రకటన లో హర్షం వ్యక్తం చేశారు.రైతుల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాలుగా రుణమాఫీ విడతల వారీగా చేయడంవల్ల అవి వడ్డీకే సరిపోయిందన్నారు.కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని రైతుల సంక్షేమం కోసం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తుందన్నారు.కోదాడ పిఎసిఎస్ లో 2018 డిసెంబర్18 నుండి 2023 డిసెంబర్ 9 వరకు 2381 రైతుల కు చెందిన 11 కోట్ల రూపాయలు మాఫీ కానున్నాయని ఆయన తెలిపారు.



